News May 26, 2024
నా చివరి టోర్నీ ఇదే అని చెప్పలేను: నాదల్

ఫ్రెంచ్ ఓపెన్ తన చివరి టోర్నీ అని చెప్పలేనని టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ అన్నారు. తాను ఇంకా టెన్నిస్ ఆడటాన్ని ఆస్వాదిస్తునట్లు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా ఎలాంటి హద్దులు లేకుండా ఆడుతానని పేర్కొన్నారు. మరొక నెల లేదా నెలన్నర రోజులకు ఆటకు వీడ్కోలు పలకొచ్చని ఈ స్పెయిన్ బుల్ తెలిపారు. నాదల్ ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. కాగా రేపటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.