News April 5, 2024

పాడేరు.. పట్టం కట్టేదెవరికి?

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు(ST) నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 5సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, BSP, జనతా పార్టీ చెరోసారి గెలిచాయి. ఈసారి సిట్టింగ్‌ MLA భాగ్యలక్ష్మిని కాదని విశ్వేశ్వరరాజును YCP బరిలో దింపింది. టీడీపీ నుంచి వెంకట రమేశ్ నాయుడు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కలిసొస్తాయని విశ్వేశ్వరరాజు ధీమాగా ఉండగా, తనకు గెలుపు ఖాయమని రమేశ్ చెబుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 18, 2025

భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలం

image

భారీ స్టేడియం పరిమాణంతో 820 అడుగుల గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఇది రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024 WY70 అని పిలువబడే ఒక భారీ గ్రహశకలం 36,606 KMPH వేగంతో దూసుకొస్తోంది. ఒకవేళ ఇది భూమిని ఢీకొన్నట్లయితే భారీ ఎత్తున వినాశనం జరుగుతుందని, దీని ప్రభావం వందలాది అణు బాంబులతో సమానమని NASA తెలిపింది.

News January 18, 2025

విజయవాడకు అమిత్ షా.. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస చేసే ఆయన రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.

News January 18, 2025

సైఫ్ అలీ ఖాన్‌కు రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్!

image

కత్తి దాడి నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. వైద్య ఖర్చులకు గాను ఆయన Niva Bupaలో రూ.35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ఓ డాక్యుమెంట్ బయటికొచ్చింది. రూ.25 లక్షలు అప్రూవ్ చేసినట్లు అందులో ఉంది. ఈ వార్తలపై కంపెనీ స్పందిస్తూ ఆయన ఫైనల్ బిల్లులు సమర్పించిన తర్వాత మొత్తాన్ని సెటిల్ చేస్తామని పేర్కొంది. ఎంత క్లెయిమ్ చేశారనేది అధికారికంగా తెలపలేదు.