News July 20, 2024

అధికారం లేక తట్టుకోలేకపోతున్నారా జగన్?: గంటా

image

AP: 40 రోజులు అధికారంలో లేకపోతేనే తట్టుకోలేకపోతున్నారా జగన్ అని TDP MLA గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజలు YCPకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ట్వీట్ చేశారు. ‘YCP దోపిడీ పాలనతో ప్రజలు విసుగుచెంది కనీవినీ ఎరుగని తీర్పునిచ్చారు. ఆ ఘోర పరాభవంతో కుమిలిపోతున్నారా? ఢిల్లీలో ధర్నా చేస్తాననడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News October 8, 2024

డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు

image

AP: డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభం అవుతాయని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వంటి పలు అంశాలను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు పేర్కొన్నారు.

News October 8, 2024

హ‌రియాణా ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ప్రజల అభీష్టాన్ని BJP తారుమారు చేసిందని దుయ్య‌బ‌ట్టింది. హ‌రియాణాలోని 3 జిల్లాల్లో EVMల ప‌నితీరుపై అనుమానాలు ఉన్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు జైరాం ర‌మేశ్, అభిషేక్ మ‌ను సింఘ్వీ పేర్కొన్నారు. BJPది ప్ర‌జాభీష్టాన్ని తారుమారు చేసిన విజ‌యంగా అభివ‌ర్ణించారు.

News October 8, 2024

రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్

image

AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.