News April 25, 2024
కరోనాలోనూ బటన్లు నొక్కడం ఆపలేదు: జగన్

AP: కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని సీఎం జగన్ తెలిపారు. ‘సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మాది. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచాం. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పని. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? అని ప్రజలను తేల్చుకోమన్నారు.
Similar News
News December 31, 2025
భారత్, పాక్ మధ్య మీడియేషన్.. చైనా సంచలన ప్రకటన

ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మీడియేషన్ చేశామని చైనా సంచలన ప్రకటన చేసింది. ‘ప్రపంచంలో అస్థిరత తీవ్రంగా పెరిగింది. ఘర్షణలను ఆపేందుకు చైనా న్యాయమైన వైఖరి అవలంబించింది. ఇండియా-పాక్, పాలస్తీనా-ఇజ్రాయెల్, కాంబోడియా-థాయిలాండ్ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించాం’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. భారత్, పాక్ యుద్ధం తానే ఆపానని US అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకుంటుండటం తెలిసిందే.
News December 31, 2025
నిద్ర లేవగానే చూడాల్సిన వస్తువులు

ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడటం వల్ల ఆ రోజంతా శుభం జరుగుతుంది. ప్రధానంగా బంగారం, ఉదయించే సూర్యుడు, ఎర్ర చందనం చూడటం అత్యంత శుభప్రదం. అలాగే ఆలయ గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి, ధర్మపత్ని, చిన్నపిల్లలను చూడటం వల్ల కూడా సానుకూల శక్తి లభిస్తుంది. ఇవి మనసులో ప్రశాంతతను నింపి, రోజంతా చేసే పనులలో విజయాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నమ్ముతారు.
News December 31, 2025
చైనాకు చెక్.. ఉక్కు దిగుమతులపై సుంకాలు!

ఉక్కు ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన స్టీల్ ప్రొడక్టులపై మూడేళ్లపాటు 11-12% దిగుమతి సుంకాన్ని విధించింది. తొలి ఏడాది 12%, రెండో ఏడాది 11.5%, మూడో ఏడాది 11%గా నిర్ణయించింది. చైనా నుంచి ఇటీవల తక్కువ రేటు స్టీల్ దిగుమతులు పెరిగాయి. ఇది స్థానిక తయారీదారులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ క్రమంలో చైనా డంపింగ్ను అడ్డుకునేందుకు ఇండియా టారిఫ్స్ విధించింది.


