News April 7, 2024
కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత?
TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత పేరును KCR ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే మరోసారి ఈ టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ MLA లాస్య నందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్రీ గణేశ్ పేరును ప్రకటించింది.
Similar News
News November 9, 2024
దమ్ముంటే.. రాహుల్ గాంధీతో సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించండి: మోదీ సవాల్
దమ్ముంటే రాహుల్ గాంధీతో హిందుత్వ నేతలు వీర సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించాలని ఇండియా కూటమి నేతలకు PM మోదీ సవాల్ విసిరారు. వారు దేశానికి చేసిన సేవలపై మాట్లాడించాలన్నారు. సావర్కర్ తమకు స్ఫూర్తి అని, మరాఠీ చరిత్ర, సంస్కృతిని విశ్వసిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ గౌరవించదన్నారు. ఎన్నికల వేళ సావర్కర్‌ను విమర్శించొద్దని కాంగ్రెస్ యువరాజుకు MVA సీనియర్ ఒకరు సలహా ఇచ్చినట్టు వివరించారు.
News November 9, 2024
బీసీసీఐ సంచలన నిర్ణయం?
హెడ్ కోచ్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు హెడ్ కోచ్‌లను నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఓడిపోతే టెస్టులకు, టీ20, వన్డేలకు వేర్వేరుగా కోచ్‌లను నియమించాలని భావిస్తున్నట్లు టాక్. కాగా భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు వైట్ బాల్, రెడ్ బాల్ జట్లకు వేర్వేరు కోచ్‌లను BCCI నియమించలేదు.
News November 9, 2024
సహజీవనం నాకు ఉపయోగపడింది: విక్రాంత్ మాస్సే
పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అర్థం చేసుకోవడం ముఖ్యమని, ఇందుకు సహజీవనం తనకు చాలా ఉపయోగపడిందని హీరో విక్రాంత్ మాస్సే చెప్పారు. అయితే తాను ఈ కాన్సెప్ట్‌ను ప్రచారం చేయట్లేదని, దీని గురించి మాట్లాడటానికీ భయమేస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ముఖ్యం. నేను, నా భార్య పెళ్లికి ముందు డేటింగ్‌తో అర్థం చేసుకున్నాం. ఇది అందరికీ పనిచేస్తుందని చెప్పలేను’ అని పేర్కొన్నారు.