News August 29, 2024
ఏఐ సిటీగా రాజధాని అమరావతి: సీఎం

AP: ఏఐ సిటీగా రాజధాని అమరావతిని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి పదంలో మొదటి, చివరి అక్షరాలు కలిపి AI సిటీ లోగోను ఆంగ్లంలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తిచేయాలని, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు. సీఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Similar News
News December 3, 2025
అవినీతి రహిత పాలనకు సహకరించాలి: కలెక్టర్ తేజస్

లంచం అడగడం, తీసుకోవడం శిక్షార్హమైన నేరమని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ స్పష్టం చేశారు. ఈ నెల 3 నుంచి 9 వరకు నిర్వహించే తెలంగాణ ఏసీబీ వారోత్సవాల సందర్భంగా బుధవారం గోడపత్రికను ఆవిష్కరించారు. పరిపాలనలో పారదర్శకత ముఖ్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు లేదా వాట్సాప్ 9440 446106 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 3, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమ్ ఇండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారి అతడు భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్ అయిన ఈ 37 ఏళ్ల బౌలర్ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టారు. IPLలో మోహిత్ CSK, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.