News August 29, 2024
ఏఐ సిటీగా రాజధాని అమరావతి: సీఎం

AP: ఏఐ సిటీగా రాజధాని అమరావతిని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి పదంలో మొదటి, చివరి అక్షరాలు కలిపి AI సిటీ లోగోను ఆంగ్లంలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తిచేయాలని, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు. సీఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Similar News
News February 18, 2025
ప్రేయసిని పెళ్లి చేసుకున్న సింగర్

సింగర్ అనువ్ జైన్ పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి హృది నారంగ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నెల 14న సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగగా తాజాగా సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా బ్రేకప్ సాంగ్స్ పాడటంలో అనువ్ జైన్‌కు మంచి పేరుంది.
News February 18, 2025
1947లో ధరలిలా ఉండేవి!

డాలర్ విలువ ఒక రూపాయితో సమానంగా ఉండేది. 10 గ్రాముల బంగారం ధర రూ.88 మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక జీతం రూ.2వేలు. చీపెస్ట్ కార్ రూ.2500. సౌత్ ఢిల్లీలో ఒక ఎకరం భూమి ధర రూ.17వేలు, ముంబైలో 2BHK రెంట్ రూ.20-50 మాత్రమే. బేసిక్ మెడికల్ టెస్టులు రూ.100- రూ.500. రూ.25కే సైకిల్ వచ్చేది. రూ.4కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 27 పైసలు.
News February 18, 2025
BREAKING: ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <