News June 27, 2024
డెన్మార్క్‌లో పాడి రైతులకు కార్బన్ ట్యాక్స్?
డెన్మార్క్‌లో ఆవులు, గొర్రెలు, పందులను పెంచుతూ జీవనం సాగించే వారికి ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. 2030 నుంచి కార్బన్ ట్యాక్స్ విధించేందుకు ప్లాన్ చేస్తోంది. హానికరమైన కార్బన్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే టన్ను కార్బన్‌డయాక్సైడ్‌కు 120 క్రోనర్ల (₹1430)తో ప్రారంభమై 2035 నాటికి 300 క్రోనర్ల (₹3500) వరకు చెల్లించాల్సి వస్తుంది.
Similar News
News December 13, 2024
నేడు ఫ్రాన్స్ ప్రధానిని ప్రకటించనున్న మేక్రాన్
ఫ్రాన్స్‌కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.
News December 13, 2024
కళకళలాడనున్న లోక్‌సభ.. ఎందుకంటే?
శీతకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభ సరిగ్గా జరిగిందే లేదు. ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ కాంగ్రెస్, ‘సొరోస్, రాహుల్ ఏక్ హై’, సొరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ BJP విమర్శించుకుంటున్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా నేడు, రేపూ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. దీనికి అన్ని పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. చాన్నాళ్ల తర్వాత సభ నిండుగా కళకళలాడనుంది. అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.
News December 13, 2024
ఘోరం: నిద్రలేపిందని తల్లిని చంపేసిన బాలుడు!
కాలేజీకి వెళ్లమంటూ నిద్రలేపిన తల్లిని ఇంటర్ చదువుతున్న బాలుడు ఆగ్రహంతో తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. UPలోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హత్య అనంతరం ఇంటికి తాళం వేసి నిందితుడు పరారయ్యాడు. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అతడి తండ్రి భార్య ఫోన్ తీయడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో కొడుకే నిందితుడని తేలింది.