News February 27, 2025
విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

AP: విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ జరగనుంది. ఏపీ ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నాస్కామ్ దీనిని నిర్వహిస్తోంది. 49 ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000+ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024, 2025 పాస్‌అవుట్ అయిన వారు అర్హులు. మార్చి 3లోగా మీ జీమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ <
Similar News
News March 24, 2025
సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News March 24, 2025
31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News March 24, 2025
APR 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు!

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి.