News August 4, 2024
గాయంతో సెమీస్ నుంచి కరోలినా ఔట్.. సింధూ సపోర్ట్
పారిస్: ఉమెన్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ (SPAIN) గాయంతో మ్యాచ్కు దూరమయ్యారు. ఆట మధ్యలో మోకాలికి గాయం కాగా నొప్పిని భరిస్తూ ఆడేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగారు. కాగా సింధూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘నా క్లోజ్ ఫ్రెండ్, ప్రత్యర్థి కరోలినా త్వరగా కోలుకోవాలి. కరోలినా.. నేను నీకు అతిపెద్ద సపోర్టర్ని’ అని పేర్కొన్నారు.
Similar News
News September 12, 2024
కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం ఏచూరి ప్రస్థానమిదే..
★1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిక
★1977-78లో మూడుసార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా ఎన్నిక
★1978లో SFI అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక
★1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నిక
★2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
★2015, 18, 22లో సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా ఎన్నిక
News September 12, 2024
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్: పంకజ్ జైన్
డిసెంబర్ 2021 తర్వాత తొలిసారి క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. మరికొన్నాళ్లు ఇదే రేటు కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. చమురు ఉత్పత్తిని పెంచాలని OPEC+ దేశాలను ఇండియా కోరడంతోపాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
News September 12, 2024
చెన్నైలో పుట్టి.. హైదరాబాద్లో పెరిగి..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో ఈ కమ్యూనిస్టు దిగ్గజం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1974లో SFIలో చేరిన సీతారాం, ఏడాది తర్వాత CPM పార్టీలో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.