News February 18, 2025
47 మంది TDP వర్గీయులపై కేసు కొట్టివేత

AP: పల్నాడు జిల్లా మాచవరంలో 47 మంది టీడీపీ వర్గీయులపై నమోదైన హత్యాయత్నం కేసును ఇవాళ గురజాల సబ్ కోర్టు కొట్టేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జులైలో తురకపాలెంకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు, అతని భార్యతో సహా 47 మందిని హత్యాయత్నం కేసులో నిందితులుగా చేర్చారు. నేడు ఆ కేసు విచారణకు రాగా కోర్టు కొట్టేసింది. దీనిపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 9, 2025
NTPCలో ఇంజినీర్ పోస్టులు

NTPC లిమిటెడ్ 4 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. జియాలజీ, జియో ఫిజిక్స్ విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://careers.ntpc.co.in
News November 9, 2025
జెమీమా, షెఫాలీ.. భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

ఉమెన్స్ ODIWC విజయం తర్వాత జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ 2-3 రెట్లు పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ‘జెమీమా ₹60 లక్షల నుంచి ₹1.5 కోట్లు, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹కోటి కేటగిరీకి చేరారు. మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.


