News May 12, 2024

యూపీలో 93మంది ఎన్నికల సిబ్బందిపై కేసు

image

యూపీలోని లక్నోలో ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 93మంది సిబ్బందిపై కేసు నమోదుకానుంది. ఎన్నికల సంఘం నిబంధనల్ని అనుసరించి వీరందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కోసం స్థానిక జననారాయణ్ పీజీ కళాశాలలో సెషన్ శిక్షణ నిర్వహించగా 93మంది రాలేదని స్పష్టం చేశారు. యూపీలో 80 సీట్లకు 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 19, 2026

పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదికపై KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి దాఖలు చేసిన పిటిషన్లను HC విచారించింది. కేసీఆర్‌, హరీశ్ తరఫున అడ్వకేట్‌ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై ఫైల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం రిప్లై ఇవ్వడానికి టైమ్ కావాలని AG కోరారు. FEB 20లోపు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు కోర్టు వాయిదా వేసింది.

News January 19, 2026

మాఘ గుప్త నవరాత్రుల గురించి మీకు తెలుసా?

image

మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. అయితే, ఇవి రహస్యంగా (గుప్తంగా) అమ్మవారిని ఉపాసించేవి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, దశమహావిద్యలను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సాధకులు ఆధ్యాత్మిక శక్తి కోసం, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడం కోసం ఈ నవరాత్రులలో కఠిన నియమాలతో పూజలు నిర్వహిస్తారు.

News January 19, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/