News December 20, 2024

కేటీఆర్‌పై కేసు.. సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు

image

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. సుమారు రెండున్నర గంటలుగా కేటీఆర్ తరఫు లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్నారు. కేటీఆర్‌పై నమోదు చేసిన కేసులో ఎన్నో లొసుగులు ఉన్నాయని, కేసును క్వాష్ చేయాలని సుందరం కోరారు. అయితే కేసు విచారణ దశలో ఉండగా క్వాష్ చేయాలనడం సరికాదని సుదర్శన్ రెడ్డి అన్నారు.

Similar News

News December 20, 2024

పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!

image

పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువుల‌పై దాడులు అధికంగా జ‌రిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువుల‌పై 112 దాడి ఘ‌ట‌న‌లు జ‌రగ్గా, బంగ్లాలో 2,200 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్ర‌భుత్వం కూలిన త‌రువాత దాడులు పెరిగిన‌ట్టు వెల్ల‌డించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.

News December 20, 2024

ఇలా చేస్తే పిల్లలు పుట్టరు!: రీసెర్చ్

image

* ఫాస్ట్‌ఫుడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహారం తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
* అధిక బరువు పెరిగిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించేందుకు 81% అవకాశముంది.
* ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
* స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది.

News December 20, 2024

రామ్‌చరణ్‌కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ నిర్మిస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరిస్తారు. కాగా ఇప్పటివరకు హీరో ప్రభాస్‌కు కట్టిన 230 అడుగుల కటౌటే దేశంలో అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.