News December 20, 2024
కేటీఆర్‌పై కేసు.. సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. సుమారు రెండున్నర గంటలుగా కేటీఆర్ తరఫు లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్నారు. కేటీఆర్‌పై నమోదు చేసిన కేసులో ఎన్నో లొసుగులు ఉన్నాయని, కేసును క్వాష్ చేయాలని సుందరం కోరారు. అయితే కేసు విచారణ దశలో ఉండగా క్వాష్ చేయాలనడం సరికాదని సుదర్శన్ రెడ్డి అన్నారు.
Similar News
News April 17, 2026
నీచులకు సాయం చేస్తే ఏమవుతుంది?

హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: చెడ్డవాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిస్తే వాడు ఎప్పటికైనా మనకు అపకారం చేస్తాడు. కడుపులోకి వెళ్లిన ఈగ ఇబ్బంది పెట్టినట్లుగా నీచుడు ప్రవర్తిస్తాడు. అందుకే దుష్టులకు సాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>
News April 17, 2026
నీచులకు సాయం చేస్తే ఏమవుతుంది?

హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: చెడ్డవాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిస్తే వాడు ఎప్పటికైనా మనకు అపకారం చేస్తాడు. కడుపులోకి వెళ్లిన ఈగ ఇబ్బంది పెట్టినట్లుగా నీచుడు ప్రవర్తిస్తాడు. అందుకే దుష్టులకు సాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>
News April 17, 2026
రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


