News January 21, 2025

పాల డబ్బా కింద పడిందని రాహుల్ గాంధీపై కేసు

image

బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న BJP, RSSలపై పోరాడుతున్నాం’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యానన్నాడు. దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కిందపడిందని.. 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు. రూ.250 నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు.

Similar News

News February 12, 2025

వాట్సాప్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News February 12, 2025

నేడే VD12 టీజర్.. ఎడిటర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో దీనిపై మరింత హైప్ పెంచేలా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గౌతమ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. VD12 టీజర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గత రెండేళ్లుగా మేము సృష్టించిన ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. వాయిస్, మ్యూజిక్ అదిరిపోతాయి’ అని పేర్కొన్నారు.

News February 12, 2025

ఆమె నోరు తెరిచిందంటే మగాళ్లపై బూతులే: FIR నమోదు

image

‘ఇండియా గాట్ లాటెంట్’ షో జడ్జి, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వా మఖీజాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సహా కొన్ని షోల్లో యథేచ్ఛగా బూతులు మాట్లాడటంపై FIR ఫైల్ చేశారు. మొన్న పేరెంట్స్ సెక్స్‌పై వల్గర్‌గా మాట్లాడిన యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాపై కేసు బుక్కైంది. ఇందులో పాల్గొన్న యువతి అపూర్వను పట్టించుకోలేదు. దీంతో మగాళ్లు మాత్రమే శిక్షకు అర్హులా, అమ్మాయిలు కాదా అని విమర్శలు వచ్చాయి.

error: Content is protected !!