News March 28, 2024
BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు

ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మమతా బెనర్జీపై ‘ఎవరి కూతురో?’, ‘బెంగాల్‌కు సొంత కూతురే కావాలి’ వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ టీఎంసీ నేతల ఫిర్యాదుతో ఘోష్‌పై కోల్‌కతాలోని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది.
Similar News
News April 10, 2026
మళ్లీ వర్షం.. మ్యాచ్ మరింత ఆలస్యం

గువాహటి స్టేడియం వద్ద మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. పిచ్‌ను సిబ్బంది కవర్లతో కప్పేశారు. దీంతో RCB-RR మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
News April 10, 2026
ఇరాన్ పాకిస్థాన్‌కు వెళ్లడం డౌటే?

USతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాక్ వేదికగా జరగాల్సిన ఈ చర్చలకు వెళ్లాలని ఓ వర్గం వాదిస్తుంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చల్లేవని మరో వర్గం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత కలహాల మధ్య ఇరాన్ ప్రతినిధుల బృందం ఇంకా ఇస్లామాబాద్ చేరుకోలేదని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇప్పటికే పాక్ పయనమయ్యారు.
News April 10, 2026
IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
జట్లు:
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, హేజల్‌వుడ్.
RR: జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, బర్గర్, ఆర్చర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేశ్.
* వైభవ్ IMPACT


