News March 28, 2024
బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు
TG: బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకుగాను ఈ కేసు నమోదైంది. కాగా హోలీ పండగ నాడు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడకి చేరుకున్నారు. బండి సంజయ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Similar News
News January 16, 2025
ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపనకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ముగింపునకు అమెరికా, ఈజిప్ట్ కూడా తీవ్రంగా కృషి చేశాయి. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో యుద్ధం మొదలైంది.
News January 16, 2025
నిరాధార ప్రచారం నమ్మొద్దు: బుమ్రా
తనకు గాయమైందని జరుగుతున్న ప్రచారంపై స్టార్ బౌలర్ బుమ్రా క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా నిరాధార ప్రచారమని ట్వీట్ చేశారు. ఇలాంటివి నవ్వు తెప్పిస్తాయన్నారు. BGTలో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఆయనకు విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని CTకి దూరమవుతారని ప్రచారం జరిగింది.
News January 16, 2025
సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ: మహేశ్ కుమార్
TG: ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. రాహుల్ తెలంగాణ టూర్, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇవాళ ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ వెల్లడించారు.