News April 8, 2024
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
TG: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి నిన్న రహస్యంగా సమావేశం నిర్వహించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News November 12, 2024
ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే మనకు మంచిదే!
US అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక H-1B వీసాలపై పరిమితులు విధిస్తే అది భారత్‌కు మేలు చేస్తుందని SBI నివేదిక అంచనా వేసింది. భారత్‌లో పెట్టుబడులు పెరగడం, దేశీయ ఉత్పాదకతలో సంస్కరణలకు బాటలు వేసి మోదీ 3.0 ఆత్మనిర్భర్ భారత్‌కు మేలు చేస్తుందని పేర్కొంది. అయితే, USలోని భారతీయ సంస్థలు స్థానిక టాలెంట్‌ను హైర్ చేసుకునేందుకు అధిక వనరులను వెచ్చించాల్సి వస్తుందని పేర్కొంది.
News November 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 12, 2024
గ్యారంటీలు ఖజానాకు భారమే: సీఎం
కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలు ప్రభుత్వ ఖజానాపై భారం మోపుతున్నాయని సీఎం సిద్ద రామయ్య అంగీకరించారు. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఐదేళ్లూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2024-25కు సంబంధించి ₹1.20 కోట్ల వార్షిక బడ్జెట్‌లో ₹56 వేల కోట్లు గ్యారంటీలకు, ₹60 వేల కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించినట్టు తెలిపారు. ఇది భారమే అయినా పథకాలు ఆపకుండా మ్యానేజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.