News May 25, 2024
50 మంది నకిలీ డాక్టర్లపై కేసులు

TG: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చేసిన సోదాల్లో అర్హత లేకుండా చలామణిలో ఉన్న 50 మంది నకిలీ వైద్యులను తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధికారులు గుర్తించారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇద్దరిని జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత కలిగిన వారి వద్దకే వెళ్లాలని చెబుతున్నారు.
Similar News
News February 19, 2025
సీబీఎస్ఈ కీలక నిర్ణయం

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.
News February 19, 2025
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
News February 19, 2025
దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.