News February 27, 2025
పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
Similar News
News March 24, 2025
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న APలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.
News March 24, 2025
MMTSలో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
News March 24, 2025
బెట్టింగ్ యాప్ కేసు.. నేడు విచారణకు యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు.