News November 28, 2024

నాపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారు.. హైకోర్టుకు RGV

image

ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై FIRలు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్జీవీపై 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

Similar News

News November 28, 2024

MH ఓటింగ్ శాతంపై మాజీ CEC అనుమానం

image

మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ CEC ఖురేషీ అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సాయంత్రం 5 గంటలకు 55% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67% అయినట్లు అధికారులు ప్రకటించారని, ఇంత వ్యత్యాసమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్‌లో నమోదైన ఓట్ల వివరాలను PO ఫామ్ 17Cలో అదే రోజు వెల్లడిస్తారని, తర్వాత రోజుకు అది ఎలా మారుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరూ నమ్మబోరని చెప్పారు.

News November 28, 2024

రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!

image

ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.

News November 28, 2024

సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.