News November 28, 2024
సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం

AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Similar News
News February 7, 2026
టీమ్ ఇండియాకు షాక్.. కుప్పకూలిన టాపార్డర్

టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాక ఇషాన్, తిలక్ కాస్త ఫామ్‌లో కనిపించారు. కానీ కాసేపటికే ఇషాన్(20) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. రెండు బంతుల తేడాతోనే తిలక్(25) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. శివమ్ దూబే కూడా గోల్డెన్ డక్ అయ్యారు. 6వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. భారత్ స్కోర్ 7 ఓవర్లలో 49/4గా ఉంది.
News February 7, 2026
ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
News February 7, 2026
100లో 31 మాత్రమే స్మార్ట్ సిటీలుగా మారాయ్!

100 నగరాల్లో కేవలం 31 మాత్రమే ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలుగా మారినట్లు కేంద్రం ఓ RTIకి సమాధానమిచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేవు. ఈ నగరాల కోసం పదేళ్లలో ₹59,385Cr ఖర్చు చేసింది. వైజాగ్ సహా మరో 43 నగరాల్లో పనులు దగ్గరపడినట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతితో పాటు 26 పట్టణాలు స్మార్ట్ సిటీస్‌గా మారేందుకు టైమ్ పడుతుందని పేర్కొంది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.


