News May 9, 2024

రూ.20వేలకు మించి నగదు ఇవ్వరాదు: RBI

image

నగదు రూపంలో రూ.20వేలకు మించి ఎవరికీ రుణాలను ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (నాన్‌బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. IT చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఈ నిబంధనను తప్పక అమలు చేయాలని సూచించింది. డిజిటలైజేషన్‌ను మరింత ప్రోత్సహించేందుకు, నగదు చలామణి కట్టడికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 7, 2025

hMPV: ఆంక్షలు విధించిన తొలి జిల్లా

image

హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కేసులతో నీలగిరి జిల్లా (TN) అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులున్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. దీంతో ప్రజల, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఫ్లూ లక్షణాలున్న వారు మాస్కు ధరించడాన్ని కలెక్టర్ తన్నీరు లక్ష్మీభవ్య తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వైలెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో తనిఖీలు చేస్తామన్నారు.

News January 7, 2025

ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం

image

AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవాళ నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని డిసైడ్ చేశారు. మరోవైపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

News January 7, 2025

గిల్‌కు అంత సీన్ లేదు: మాజీ సెలక్టర్

image

శుభ్‌మన్ గిల్ ఓ ఓవర్‌రేటెడ్ క్రికెటర్ అని, ఆయనకు భారత్ అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నా మాట ఎవరూ వినలేదు. గిల్‌కు అంత సీన్ లేదు. అతడి బదులు సూర్యకుమార్, రుతురాజ్, సాయి సుదర్శన్ వంటి వారిని ప్రోత్సహించాలి. ప్రతిభావంతులకు బదులు గిల్‌కు ఛాన్సులిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.