News May 7, 2024

అధికారంలోకి రాగానే కులగణన: భట్టి

image

TG: బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రిజర్వేషన్లు తొలగించేందుకే ఆ పార్టీ 400 సీట్లు కోరుతోందని ఆరోపించారు. దేశంలో 90శాతం ప్రజల హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతుందని భట్టి తెలిపారు.

Similar News

News January 6, 2025

తెల్లారే పెన్షన్లు ఇవ్వాలా?: వెంకట్రామిరెడ్డి

image

AP: రాష్ట్రంలో తెల్లారే పెన్షన్లు ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా అని రాష్ట్ర గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా? అని నిలదీశారు. వేరే ఊరిలో ఉన్న మహిళా ఉద్యోగి పెన్షన్లు ఇవ్వడానికి ఎన్నిగంటలకు నిద్రలేచి రావాలో గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా IR, పెండింగ్ డీఏల్లో ఒకటైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News January 6, 2025

మహిళ పొట్టలో 58 డ్రగ్ క్యాప్సుల్స్

image

బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు. డ్రగ్ క్యాప్సుల్స్ మింగిన వీరిని కస్టమ్స్ టీం గుర్తించగా, ప్రాథమిక విచారణలో కొన్నింటిని నిందితులే వెలికితీశారు. ఆపై ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేసి పురుషుడి కడుపులోనుంచి 937గ్రా.బరువున్న 105, మహిళ నుంచి 562గ్రా. 58 క్యాప్సుల్స్ బయటకు తీశారు. వీటి విలువ రూ.20cr ఉంటుందని అధికారులు చెప్పారు.

News January 6, 2025

నేడు ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి

image

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ కేసు, అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంలో అధికారులు VSRను ప్రశ్నించనున్నారు. ఉ.10 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కానుంది.