News January 6, 2025

నేడు ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి

image

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ కేసు, అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంలో అధికారులు VSRను ప్రశ్నించనున్నారు. ఉ.10 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కానుంది.

Similar News

News December 16, 2025

ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

image

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.

News December 16, 2025

రేపే మూడో విడత ఎన్నికల పోలింగ్

image

TG: రేపు 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,752 స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,410 వార్డు మెంబర్ల స్థానాలకు 75,725 మంది బరిలో నిలిచారు.

News December 16, 2025

ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

image

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్‌నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.