News February 26, 2025
కులగణన రీసర్వే.. ఆసక్తి చూపని కుటుంబాలు

TG: కులగణన రీసర్వేకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా కుటుంబాలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండోసారి సర్వేలో 3,56,323 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,422 కుటుంబాలే ఎంట్రీ చేయించుకున్నాయి. రీసర్వేకు ఎల్లుండితో గడువు ముగియనుంది. సర్వేలో పాల్గొనాలనుకునేవారు ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు 040 21111111 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. MPDO ఆఫీసుల్లోనూ వివరాలు ఇవ్వొచ్చు.
Similar News
News March 20, 2025
రెండో భర్తతో సింగర్ విడాకులు

ప్రముఖ సింగర్ సియా ఫర్లర్ తన రెండో భర్త డేనియల్ బెర్నాడ్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత వారిద్దరు వేరుకానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విడాకుల కోసం సియా కోర్టును ఆశ్రయించినట్లు పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. ఆమె పాడిన <
News March 20, 2025
ఈ నెల 29న సూర్య గ్రహణం

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.
News March 20, 2025
కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్‌లోని నవ్‌గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.