News November 25, 2024
కులగణన శాస్త్రీయంగా జరగాలి: MLC కవిత
TG: బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు MLC కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, BRS బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు.
Similar News
News November 25, 2024
IPL వేలంలో ఈ భారత్ ఆటగాళ్లకు షాక్
భారత క్రికెటర్లు అజింక్య రహానే, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అలాగే SRH మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా ఎవరూ కొనలేదు.
News November 25, 2024
మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్
TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.
News November 25, 2024
రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు: సీఎం
TG: రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి తెలంగాణలో పెట్టుబడులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూల్స్ ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచే తాము కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.