News December 26, 2024

జనగణనలో కులగణన చేపట్టాలి: సీఎం రేవంత్

image

TG: జనగణనలోనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ అన్నారు. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘త్వరలో దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది నష్టపోతుంది. తక్కువ ఎంపీ సీట్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 27, 2024

నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

image

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్‌తో మెయిల్ మార్చాలని బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్‌కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్‌తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.

News December 27, 2024

జపాన్‌లో ‘దేవర’ తాండవం.. ఎప్పుడంటే?

image

జపాన్‌ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్‌లో రిలీజ్ కానుంది. 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘దేవర’ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News December 27, 2024

వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్

image

TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.