News December 26, 2024
జనగణనలో కులగణన చేపట్టాలి: సీఎం రేవంత్

TG: జనగణనలోనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ అన్నారు. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘త్వరలో దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది నష్టపోతుంది. తక్కువ ఎంపీ సీట్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News July 9, 2025
‘మెగా 157’: పోలీసులుగా చిరు, వెంకీ?

చిరంజీవి-నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మెగా 157’లో తన క్యామియో ఉంటుందని <<16974411>>వెంకటేశ్<<>> చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని టీటౌన్‌లో ప్రచారం మొదలైంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.
News July 9, 2025
కృష్ణమ్మలో గోదావరి జలాలు.. మంత్రి పూజలు

AP: పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కృష్ణమ్మలో కలిశాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పవిత్ర సంగమంలో మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే ఇప్పటివరకు 428 TMCలకు పైగా కృష్ణాకు తరలించామని తెలిపారు. చంద్రబాబు ముందుచూపు వల్లే గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో పంటలు పండుతున్నాయని, ఆయన ముందుచూపుకు ఈ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అని అన్నారు.
News July 9, 2025
ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.