News June 12, 2024
కులాలవారీగా మంత్రి పదవులు ఇలా..

AP: చంద్రబాబు నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుంది. ఎనిమిది మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి పదవి వరించింది. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో పది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
Similar News
News March 27, 2025
పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు

AP: Dy.CM పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలోని మూలపేటలో రికార్డింగ్ డాన్సుల వీడియో SMలో వైరలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా అర్ధరాత్రి అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. ఓ వైపు టెన్త్ పరీక్షలు జరుగుతుంటే ఇలాంటి డాన్సులు ఏర్పాటు చేయడం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. పవన్ స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా గైడ్‌లైన్స్ ప్రకారం ఆ <
News March 27, 2025
రోహిత్‌ను రోజూ 20KM పరిగెత్తమని చెప్తా: యువరాజ్ తండ్రి

దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీమ్ ఇండియాకు కోచ్‌గా నియమిస్తే రోహిత్ శర్మను రోజూ 20KM పరిగెత్తమని చెప్తానని అన్నారు. ప్రస్తుత ఆటగాళ్లతోనే ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. రోహిత్, కోహ్లీని రంజీ ట్రోఫీలో ఆడించాలన్నారు. వారిద్దరూ వజ్రాల్లాంటి ప్లేయర్లని కొనియాడారు.
News March 27, 2025
ప్రపంచ కుబేరుల కొత్త జాబితా!

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎలాన్ మస్క్ $420 బిలియన్ల(దాదాపు రూ.36 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక మస్క్ ఆస్తి భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. వీరి తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.