Andhra Pradesh

News June 26, 2024

కొండగట్టు అంజన్న సన్నిధికి పిఠాపురం MLA పవన్ కళ్యాణ్

image

ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం,పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో‌ ఉన్నారు. ఇందులో భాగంగానే‌ ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.

News June 26, 2024

తిరుపతి: డయేరియా సోకి చిన్నారి మృతి

image

డయేరియా సోకి చిన్నారి మృతి చెందిన ఘటన కేవీబీ పురం మండలంలో జరిగింది. చిన్నారి బంధువుల వివరాల మేరకు.. మండలంలోని కాట్రపల్లి దళితవాడకు చెందిన దుష్యంత్, కామాక్షమ్మ దంపతుల కుమార్తె దర్శిని(2)కి డయేరియా వచ్చింది. దీంతో చిన్నారిని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కాట్రపల్లి ప్రజలు డయేరియా భయంతో వణికిపోతున్నారు.

News June 26, 2024

కడప: ఎమ్మెల్యేగా గెలుపు.. తిరుమలకు పాదయాత్ర

image

కమలాపురం నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన పుత్తా చైతన్యరెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలోని వల్లూరు మండలం దిగువపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను ఈరోజు ఉదయం నిర్వహించారు. అనంతరం స్థానిక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఇతర నాయకులతో కలిసి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినందుకు మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు.

News June 26, 2024

ఈ ఐక్యతతో హోదా సాధించండి: రఘువీరా రెడ్డి

image

రాష్ట్రంలోని ఎంపీలంతా ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి స్పందించారు. ‘మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఎన్డీయే ప్రతిపాదించిన స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. అలాంటి ఐక్యతతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 26, 2024

అండర్-16 క్రికెట్‌లో విశాఖ ఘన విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిర్వహిస్తున్న అండర్-16 బాలుల అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో విశాఖపట్నం జట్టు 433 పరుగుల భారీ తేడాతో ప.గో. జట్టుపై విజయం సాధించింది. ప.గో. 89 పరుగులకే ఆలౌట్ అయింది. 6 వికెట్లు తీసి విశాఖ బౌలర్ కె.గౌతమ్ ఆర్య పశ్చిమగోదావరి జట్టు పతనాన్ని శాసించాడు. 2వ ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

News June 26, 2024

జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు: మంత్రి సంధ్యారాణి

image

ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ ‌కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.

News June 26, 2024

పర్చూరు: మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు.. కేసు నమోదు

image

పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

News June 26, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 టీచర్ పోస్టులు ఖాళీలు

image

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 551, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 583 పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్‌లో లాంగ్వేజ్-1 పోస్టులు 44, లాంగ్వేజ్ -2లో 43, ఇంగ్లీష్ 59, గణితం 66, ఫిజికల్ సైన్స్ 74, బయాలజీ 62, సోషల్ స్టడీస్ 99, హిందీ 139 ఖాళీలు ఉన్నాయి.

News June 26, 2024

కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం

image

నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులకు కొత్త చట్టాలపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో, నూతన చట్టాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

News June 26, 2024

గంపలగూడెం: విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి

image

గంపలగూడెం మండలం పెనుగొలనులో సుబాబుల్ లోడుతో వెళుతున్న లారీకి బుధవారం విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఆర్సీఎం చర్చి వద్ద విగతజీవిగా పడి ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.