India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా సంబంధిత శాఖ అధికారులు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆహ్వానించాలన్నారు.

అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్(24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం అన్నారు. ప్రతీ విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పామిడి మండలం కాలాపురం సమీపంలో బుధవారం రాత్రి జి.కొట్టాలకు చెందిన వైసీపీ నేత సతీశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట హత్య అని వార్తలు రాగా, ప్రాథమిక దర్యాప్తు అనంతరం సతీశ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్‌ను విచారించామని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గురువారం ఎన్నికయ్యారని అనంతపురం జిల్లా నాయకులు తెలిపారు. చండీఘర్‌లో జరిగిన 25వ మహాసభలో జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాట యోధుడు రామకృష్ణ అని కొనియాడారు.

తన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ట్వీట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ అకౌంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. <<17822177>>ఫేక్<<>> అకౌంట్‌ను కూటమి నాయకులు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను మంత్రి సవిత, రాప్తాడు MLA పరిటాల సునీత, శింగనమల MLA బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది దృష్టి సాధించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు 110 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.
Sorry, no posts matched your criteria.