India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇంటర్, స్కూల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్‌లో ధర్మవరం బాలికల జట్టు రాణించి రన్నర్స్‌గా (ద్వితీయ స్థానం) నిలించింది. ఈ మేరకు అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి గురువారం తెలిపారు. గత నెల 28, 29, 30వ తేదీలలో చిత్తూరులో జరిగిన టోర్నమెంట్‌లో ధర్మవరం జట్టుపై బంగారుపాలెం జట్టు 2 పాయింట్లతో గెలిచి మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.
అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురంలోని ఓ కళాశాలలో <<15040374>>ఇంటర్<<>> విద్యార్థిని చిన్నతిప్పమ్మ (17) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అందిన వివరాల మేరకు.. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆర్డీటీ సహకారంతో చదువుకుంటోంది. తన జూనియర్ ఓ బాలికతో స్నేహం ఉండగా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటరితనంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాలేజీ హాస్టల్లోనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. విడపనకల్ మండలం పాల్తూరుకు చెందిన చిన్నతిప్పమ్మ అనంతపురంలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇవాళ ఆమె తన కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని చనిపోయింది. గమనించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.9 పలికింది. సరాసరి ధర రూ.6, కనిష్ఠ ధర రూ.4తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.27,420 తో అమ్ముడయ్యాయి.
ఎస్సీ కుల గణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Sorry, no posts matched your criteria.