India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాకు RCF సంస్థ నుంచి 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని DA అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ప్రసన్నాయిపల్లి రేట్ పాయింట్ వద్ద ఆయన యూరియాను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు 899.01 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 583.29 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

అనంతపురం జిల్లా జంతలూరులోని AP సెంట్రల్ యూనివర్సిటీని న్యూఢిల్లీ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. కౌన్సిలర్ యాంగ్ షీయుహువా, జాంగ్ హైలిన్, సూ చెన్, ఫాంగ్ బిన్ CUAP ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరిని కలిశారు. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులకు చైనా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఉపకారవేతన పథకాల గురించి వివరించారు.

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు అనూహ్య స్పందన లభించినట్లు SP జగదీశ్ పేర్కొన్నారు. మొత్తం 121 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేకు 334 అర్జీలు వచ్చాయని జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు.

అనంతపురం JNTUలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుదర్శన రావు ఎంతో మంది యువకులను ఉత్తమ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. ఆయన గతంలో AEE ఉద్యోగం వదిలేసి టీచింగ్‌ను ఎంచుకున్నారు. తన అసాధారణమైన బోధనతో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆయన స్టూడెంట్స్ AE, AEEలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇండియాలోని బెస్ట్ టీచర్లలో ఆయన ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
#EngineersDay2025
Sorry, no posts matched your criteria.