Anantapur

News March 28, 2026

SKU వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్ బాధ్యతలు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఈయనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల 13న వైస్ ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.

News March 28, 2026

మూడు రాజధానులపై మంత్రి కేశవ్ తీవ్ర విమర్శలు

image

అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత కష్టకాలంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం నిలబడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

News March 28, 2026

అనంతపురం పోలీస్ AI హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే

image

పోలీస్ శాఖ నిర్వహించిన AI హ్యాకథాన్ 2026 గ్రాండ్ ఫినాలే శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ పి.జగదీశ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. టెక్నాలజీని ప్రజల భద్రత కోసం వినియోగించాలన్నారు. సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనగా 40 టీమ్స్ ఫైనల్‌కు చేరాయి. AI ఆధారిత పోలీసింగ్‌లో యువత ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు.

News March 27, 2026

అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

image

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.

News March 26, 2026

గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

image

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

నిషేధిత భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

జిల్లాలో ఉన్న నిషేధిత భూ సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టామని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ భవనంలో జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 22ఏ, డాటెడ్ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News March 26, 2026

అనంత: ‘చదువుతో పాటు నైపుణ్యం ఎంతో అవసరం’

image

అనంతపురం జేఎన్టీయూలోని MBA విభాగంలో గురువారం ‘How to crack interviews & build a winning resume’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. MBA విభాగాధిపతి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతకు చదువుతో పాటు నైపుణ్యం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో SVNT ఇన్ఫోటెక్ సంస్థ హెడ్ శివ, NSS ప్రోగ్రాం ఆఫీసర్ హనుమాన్ ప్రసాద్ పాల్గొన్నారు.

News March 26, 2026

400 మంది విద్యార్థుల గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో బుధవారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 143 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 32,485 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 32,085 మంది హాజరయ్యారు. 400 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పర్యవేక్షణ కోసం 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరీక్షల నిర్వహణ క్రమబద్ధంగా జరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.