Anantapur

News March 26, 2026

అనంత: ఇవాళ రూ.లక్ష గెలుచుకునే ఛాన్స్!

image

పెద్దవడుగూరు మండలంలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు జరగనున్నాయి. వీరభద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 9 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి రూ.లక్ష ఇవ్వనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తెలిపారు.

News March 25, 2026

భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు అనేక ఉద్యోగాలు

image

అనంతపురం జేఎన్టీయూలోని ఎలక్ట్రికల్ విభాగంలో EYE-2K26 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా APSPDCL సూపరింటెండెంట్ ఇంజినీర్ శేషాద్రి శేఖర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కు అనేక ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. 2029 సంవత్సరానికి ఒక అనంత జిల్లాలోనే 7,500 MW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయగలమని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దిలీప్, HOD రామశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

తాడిపత్రిలో జేసీ విష్ణు చరణ్ పర్యటన

image

తాడిపత్రిలో అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం పర్యటించారు. కడప రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని స్థానిక అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 15 రోజుల నుంచి ఎంతమంది బుకింగ్ చేసుకున్నారు, ఎంతమందికి డెలివరీ చేశారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్‌లో ఎంత స్టాకు ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు. తహశీల్దార్ సోమశేఖర్, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ మల్లేశ్ ఉన్నారు.

News March 25, 2026

ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయిలో లబ్ధి అందాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, పథకాల లబ్ధి పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కేటాయించిన శాతాన్ని ఖచ్చితంగా ఖర్చు చేయాలని, హౌసింగ్, ఉపాధి, పెన్షన్లు వంటి పథకాలలో లక్ష్యాలు చేరాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేయాలని, PMAGY పనులు ఏప్రిల్‌లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News March 25, 2026

పురపాలికల్లో వార్డుల పెంపునకు కసరత్తు

image

అనంతపురం జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలైంది. జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 204 వార్డులకు అదనంగా 50 పెరగనున్నాయి. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 254కు చేరనుంది. వార్డుల విభజన వల్ల హద్దులు మారడంతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్య పెరగనుంది.

News March 25, 2026

అనంతపురం: యువకుడి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

image

అనంతపురం ఆర్టీసీ బస్టాండు వద్ద ఈ నెల 22న జరిగిన ఆదర్శ నాయుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో పదునైన టైల్స్ ముక్కతో పొడవడంతో యువకుడు మృతి చెందాడు. నిందితులు బన్నీ, కరుణాకర్ రెడ్డి, రాకేష్, అస్మిత్ చౌదరి, ఉజ్జినప్పలను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు యువకులే కావడం గమనార్హం.

News March 25, 2026

సౌత్ జోన్‌కు ఎంపికైన SKU విద్యార్థులు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఖోఖో టీంకు 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రిజిస్ట్రార్ రమేశ్ విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని వారికి సూచించారు. వీరందరూ ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని దావనగెరెలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొననున్నారన్నారు.