Anantapur

News September 5, 2024

అనంత: జాతీయ స్థాయి అర్చరీ చాంపియన్‌షిప్ పోటీలకు సంతోశ్ ఎంపిక

image

నార్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన సాకే సంతోశ్ జాతీయ స్థాయి అర్చరీ చాంపియన్‌షిప్ పోటీకు ఎంపికయ్యాడు. తండ్రి మారెన్న సిద్దరాచెర్ల గ్రామ నౌకరుగా, తల్లి సరస్వతి నార్పల ఎంఆర్‌సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. సంతోశ్ అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 26న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు తెలిపారు.

News September 5, 2024

అనంతపురం ఆతిథ్యం బాగుంది: రుతురాజ్‌, అయ్యర్‌

image

అనంతపురంలో సదుపాయాలు బాగున్నాయని కెప్టెన్లు రుతురాజ్‌, అయ్యర్‌ కొనియాడారు. ‘దేశంలోని అత్యుత్తమ గ్రౌండ్లలో అనంతపురం ఒకటి. అనంతపురం ఆతిథ్యం బాగుంది. పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల ఇక్కడి క్రికెటర్లకు ఎదగాలన్న ఆసక్తి రేకెత్తుతుంది’ అని తెలిపారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు.. ఇక్కడికి వచ్చింది పోటీల్లో ప్రతిభను నిరూపించుకోవడానికే గానీ రుచికరమైన వంటలు తినడానికి కాదని చమత్కరించారు.

News September 5, 2024

కిడ్డీ బ్యాంక్ నుంచి మంత్రి సవిత కుమారుడి విరాళం

image

రాష్ట్ర మంత్రి సవిత కుమారుడు జగదీశ్ సాయిని సీఎం చంద్రబాబు బుధవారం అభినందించారు. విజయవాడలో వరద బాధితుల కోసం జగదీశ్‌ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.21 వేలను విరాళంగా అందజేశారు. నిన్న రాత్రి చంద్రబాబుని కలిసి ఆ మొత్తం అందజేయగా సీఎం మంత్రి కుమారుడిని అభినందించారు.

News September 5, 2024

ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు

image

డిసెంబర్ 8వ తేదీ జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. ఈనెల 6వ తేదీ ముగియాల్సిన గడువును 17వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపల్, ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News September 4, 2024

రేపు క్రికెట్ మ్యాచ్‌కు వెళ్తున్నారా.. అయితే మీకోసమే ఈ సమాచారం..!

image

అనంతపురంలో రేపు జరగనున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ తిలకించి అభిమానులకు కమిటీ సభ్యులు పలు సూచనలు సలహాలు చేశారు. స్టేడియంలోకి లాప్‌టాప్స్, కెమెరాలు, అగ్గి పెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్టు, లైటర్లు, హెల్మెట్లు, నీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, షార్ప్‌ మెటల్స్‌, తదితర వస్తువులను అనుమతి లేదని స్పష్టం చేశారు.

News September 4, 2024

అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

image

కేంచమ్మనహళ్లి గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కంబదూరు మండలం తిమ్మాపురానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ ఈరన్న, అతని తమ్ముడు చిక్కీరప్ప తీవ్రంగా గాయపడ్డారు. అయితే పావగడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరన్న మృతిచెందారు. ఈ ఘటనతో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News September 4, 2024

సత్యసాయి కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా రెవిన్యూ అధికారి రామకృష్ణ రెడ్డి సత్యసాయి కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం అయినట్లు కార్మిక సంఘం నాయకులు ఉపేంద్ర కుమార్ తెలిపారు. కార్మికులకు ఎలాంటి తక్షణ సహాయం లేకుండా సమ్మె విరమించాలని అడిగారన్నారు. అందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదని చెప్పారు. సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు.

News September 4, 2024

27 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక

image

సత్యసాయి జిల్లాలో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న గురు పూజోత్సవ వేడుకల్లో అవార్డుకు ఎంపికైన వారికి అందించనున్నట్లు వెల్లడించారు. అవార్డులకు ఎంపికైన వారందరికీ కార్యాలయం నుంచి సమాచారం పంపినట్లు తెలిపారు.

News September 4, 2024

దులీప్ ట్రోఫీ.. స్టేడియంలో నాలుగు గ్యాలరీలు ఏర్పాటు

image

అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం సామర్థ్యాన్ని బట్టి మ్యాచ్‌లు తిలకించేందుకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేసినట్లు దులీప్ ట్రోఫీ సెక్రటరీ షాబుద్దీన్ తెలిపారు. స్టేడియంలోని సీ-గ్యాలరీలో 700, డీ-గ్యాలరీ 400, ఈ-గ్యాలరీ 1100, ఎఫ్-గ్యాలరీలో 720 మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా ఆర్డీటీ అధికారులు ఎంట్రీ పాసులను జారీ చేసినట్లు చెప్పారు. పాసులు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

News September 4, 2024

వైసీపీ అనంత జిల్లా అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డి

image

వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పైలా నర్సింహయ్య వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంతపురం అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అనంత వెంకటరామిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.