India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం JNTU పరిధిలో గతేడాది నవంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన M.Pharmacy 1, 2, 4వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21), M.Tech 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. Share It
రైలు కిందపడి కొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లి సైతం రైలు కిందపడి మరణించింది. తాడిపత్రికి చెందిన శ్రీచరణ్ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ప్రసన్నాయిపల్లి వద్ద రైలు కిందపడి గురువారం సూసైడ్ చేసుకున్నాడు. అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి శైలజ శనివారం ఉదయం తాడిపత్రిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలు పలువురినీ కంటతడి పెట్టించాయి.
అనంతపురం జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండల పరిధిలోని కల్లూరు గ్రామ సమీపంలో సంచారాలు చేసేవారు నివాసం ఉంటున్నారు. అయితే ఎద్దులు మేపేందుకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఎడ్లు పెన్నా నదిలో దిగి నీరు తాగుతుండగా.. వాటిని బయటకు తోలే ప్రయత్నంలో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మృతులు కల్లూరుకి చెందిన లక్ష్మి(10), హరిణి(12)లుగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నాయకునిపల్లి గ్రామానికి చెందిన మునిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్‌కు ఉన్న మెయిన్ లైన్ నుంచి వచ్చే హెడ్ ఫీజులు కట్ కావడంతో వేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్తు ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలోని ఇంద్రనగర్‌కు చెందిన బాలు, గుత్తి మండలం కొత్తపేటకు చెందిన స్రవంతి ప్రేమించుకుని శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్నారు. రెండేళ్ల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుతూ.. పెద్దల సమక్షంలో ఆదోనిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
మహిళలు, అమ్మాయిల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన చేయాలని పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌కు ఎస్పీ జగదీశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ తమ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించవచ్చన్నారు.
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కె.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.