Anantapur

News December 11, 2024

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు: ఎస్పీ

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ జగదీశ్ బుధవారం వెల్లండించారు. జిల్లాలో గడచిన 24 గంటలలో రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై 789 కేసులు నమోదు చేసి రూ.1,86,350 ఫైన్స్ విధించామన్నారు. బహిరంగంగా మద్యం తాగిన వారిపై ఓపెన్ డ్రింకింగ్ 61 కేసులు, డ్రంకన్ డ్రైవింగ్‌పై 20 కేసులు నమోదు చేశామన్నారు.

News December 11, 2024

గార్లదిన్నె మండలంలో బాలికపై అత్యాచారం

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో దారుణ ఘటన జరిగింది. బాలికపై వంశీ అనే వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి వరకు చదివిన బాలిక పొలం పనులకు వెళ్తోంది. కూలీలను పొలానికి తీసుకెళ్లే డ్రైవర్‌కు బాలికతో పరిచయం ఏర్పడంది. మాయమాటలతో అత్యాచారం చేశాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక పామిడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా ఏడు నెలల గర్భిణి అని తేలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News December 11, 2024

విజయవాడకు వెళ్లిన అనంత, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు: కలెక్టర్

image

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. జిల్లాస్థాయిలో మైనర్ ఇరిగేషన్ సంఘాలు 214, మీడియం ఇరిగేషన్ సంఘాలు 16.. మొత్తం 230 ఉన్నాయని తెలిపారు. ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

News December 11, 2024

ATP: ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం

image

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువుకు చెందిన జ్యోతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలు తేజ, సాహితితో కలిసి అదృశ్యమైంది. ఈనెల 3న ఆమె పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. అయినా లభించలేదు. జ్యోతి తల్లి లక్ష్మీదేవి మంగళవారం యాడికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూతురు, ఇద్దరు పిల్లలతో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయండంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 11, 2024

అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్ల ఆవిష్కరణ

image

రైతాంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న ‘అన్నదాతకు అండగా వైసీపీ’ ర్యాలీకి సంబంధించి పోస్టర్లు ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం పాల్గొన్నారు.

News December 10, 2024

త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ చేతన్

image

రెవెన్యూ సదస్సులలో వస్తున్న ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం శనివారం గ్రామ సచివాలయంలో తహశీల్దార్ సౌజన్య లక్ష్మీ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో 56 రకాల సర్వీసులు ఉచితంగా పొందవచ్చన్నారు.

News December 10, 2024

వసతి గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

వసతి గృహాల నిర్మాణ మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతి లోపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News December 10, 2024

అనంతపురంలో కేజీ టమాటా రూ.20

image

టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.

News December 10, 2024

అనంతపురంలో కేజీ టమాటా రూ.20

image

టమాటా ధరలు పడిపోయాయి. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండగా తాజాగా రూ.20కి చేరింది. కనిష్ఠంగా రూ.5, సరాసరి రూ.10తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.37,280 పలికాయి.