Anantapur

News March 1, 2025

సీఎస్ వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

image

రాష్ట్ర సచివాలయంలోని CS కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. పెన్షన్లు, MSME సర్వే, ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పథకానికి భూమి కేటాయింపు తదితర అంశాలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. తక్షణమే వీటిపై తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు సూచించారు.

News February 28, 2025

కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.

News February 28, 2025

ATP: రూ.2.95కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

image

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

News February 28, 2025

బడ్జెట్‌లో సూపర్-6 పథకాలకు చిల్లు: అనంత

image

అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సూపర్-6 పథకాలకు చిల్లు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను అంకెల గారడిగా అభివర్ణించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానం బహిర్గతం అయ్యిందన్నారు.

News February 28, 2025

గోరంట్ల మాధవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ వ్యవహరించారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 28, 2025

రీ సర్వేను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

image

యాడికి మండలం చందన రెవెన్యూ గ్రామాల్లో గురువారం రీ సర్వేను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పరిశీలించారు. రీ సర్వే జరుగుతున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. రీ సర్వేకు వెళ్లే ముందు రోజే సంబంధిత రైతులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతులు హాజరు కాకపోతే మూడుసార్లు అవకాశం ఇవ్వాలన్నారు. రీ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలన్నారు.

News February 28, 2025

డ్రగ్స్, సర్జికల్స్ అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అవసరమైన డ్రగ్స్, సర్జికల్స్ కచ్చితంగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్. ఆదేశించారు. గురువారం అనంతపురంలోని శారద నగర్‌లో ఉన్న ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోటూ ఉండరాదన్నారు.

News February 27, 2025

బ్రెయిన్ స్ట్రోక్‌తో యువకుడి మృతి

image

ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన బోయ నింబగంటి వేణు (22) అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఉన్నఫళంగా కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కర్నూలు తీసుకెళ్లమని సూచించారు. ఈ క్రమంలోని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 27, 2025

శింగనమలలో శివపార్వతుల కళ్యాణోత్సవం

image

అనంతపురం జిల్లాలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి శింగనమల మండల కేంద్రంలోని భవానిశంకర్ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శివపార్వతుల విగ్రహాలు, పట్టువస్త్రాలు, బంగారు మంగళ సూత్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించారు.

News February 27, 2025

గుంతకల్లు వాసికి సన్మానం

image

గుంతకల్లుకు చెందిన బ్లడ్ డోనర్ రెడ్ డ్రాప్ రెహ్మాన్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక తొర్నగల్ జిందాల్ ఫ్యాక్టరీలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రెహ్మాన్‌ను జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ మేనేజర్ పెద్దన్న, ముఖ్య అతిథులు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ సునీల్ రాల్ఫా చేతుల మీదుగా జ్ఞాపికతో సత్కరించారు. 133 సార్లు రక్తదానం చేసినందుకు రెహ్మాన్‌కు సన్మానం చేశారు.