India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆడపిల్లల రక్షణ, భద్రతకు అధికారులు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం “మిషన్ శక్తి” ఇంటిగ్రేటెడ్ మహిళాసాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు, సహాయం కావలసిన వారికి పునరావాసం, భద్రత కల్పించడానికి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.
అనంతపురం: నవజాత శిశువుల్లో సోకే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని DMHO దేవి సూచించారు. సర్వజన ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య అధికారులతో సమావేశమయ్యారు. నవజాత శిశువులు, గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నవజాత శిశువులు వ్యాధులు బారిన పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్స చేయించాలన్నారు. అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడకం అరికట్టాలని సూచించారు.
అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సంతోశ్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చోటే, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు.
గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు త్వరలో జరగనున్నాయి. వీటికి చెట్నేపల్లి సమీపంలోని భూములను కేటాయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం వీటిని పరిశీలించారు. మ్యాపులను వీక్షించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు M.Tech స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీఈసెట్లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జీరాక్స్ కాపీలను కూడా తీసుకొని రావాలని సూచించారు.
ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం JNTUలో M.Tech, M.Pharmacyలకు ఈనెల 16వ తేదీన స్పాట్ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆర్.కిరణ్మయి తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీఈసెట్లో అర్హత సాధించి ఉండాలని, ఆసక్తి గల విద్యార్థులు శనివారం ఉదయం పరిపాలన భవనంలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్లను కూడా తీసుకొని రావాలని పేర్కొన్నారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి బీటెక్ 4వ సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ ప్రొ. నాగప్రసాద్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజుల కిందట నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు చేత తరగతులు జరగకపోగా.. ఇప్పటి నుంచి తరగతులను కాస్త పెంచుతూ DEC-4వ తేదీన జరగాల్సిన పరీక్షలను కూడా DEC-13వ తేదికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
పుట్టపర్తి మండల పరిధిలోని బడే నాయక్ తండాలో ప్రభుత్వ టీచర్ శంకర్ నాయక్ను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మద్యం తాగి పాఠశాలలో విధులకు హాజరవుతున్నారని, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను హెచ్చరించారు. తీరు మారకపోవడంతో చర్యలు తీసుకున్నారు.
అనంతపురంలోని కృపానంద నగర్లో ఇటీవల చోరీ జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు చేధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Sorry, no posts matched your criteria.