India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమజంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు ఓ మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెల 15న మునిమడుగులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు 20మంది నిందితులను అనంతపురం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాలను కేటాయించినట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈడిగలకు 9, కాలాలి 1, గౌడు 2, గౌడ 1, గౌన్లకు 1 కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17న రెవెన్యూ భవన్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, జిల్లా పరిధిలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రకటన, పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న బెల్ కంపెనీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజలు ఎదరుచూస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీకి నిధులు పెరిగితే జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.
ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారుల మీద బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తరచు వాహనాలు తనిఖీలు చేపట్టి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
ఫిబ్రవరి 5న ‘అనంత హార్టికల్చర్ కాంక్లేవ్’ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఇందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తామన్నారు.
అనంతపురంలోని కొత్తూరు, పాతూరు అమ్మవారి శాలల్లో వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం వాసవీమాతకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో పింఛన్లకు రూ.124.94కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇవాళ సాయంత్రంలోగా ఈ మొత్తాన్ని ఆయా మండలాల్లోని అధికారులు విత్ డ్రా చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. అనంతపురం జిల్లాలో 2,85,754 మందికి పింఛన్ నగదును అందజేస్తారు. మధ్యాహ్నంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మండలంలోని కె కె.అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మూర్తిగా తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు జిజిహెచ్ ద్వారా అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశానికి పార్లమెంటు సభ్యులు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ సేవలు అందించాలన్నారు.
అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన M.Sc 3, 4 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.