Anantapur

News January 17, 2025

వీరుడా.. ఇక సెలవు

image

విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి (45) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమర్‌రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు.

News January 17, 2025

పెనుకొండ కియా నుంచి కొత్త కారు

image

పెనుకొండ కియా కంపెనీ నుంచి కియా సిరోస్ (Kia Syros) కారు ఉత్పత్తి ప్రారంభమైంది. ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో-2025లో ఈ కారును ప్రదర్శించనున్నారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 1న కారు ధర నిర్ణయిస్తామని సీఈవో హొసంగ్‌ తెలిపారు. ఇప్పటికే 10,258 మంది బుక్‌ చేసుకున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయని వివరించారు.

News January 16, 2025

పక్షుల కోసం 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్ల ఏర్పాటు

image

పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు ఏర్పాటు చేసి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం అభినందనీయమని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఆర్మీ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ అచ్చుల కోసం గూళ్లను ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అభినందించారు. ఇందుకు హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ వారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.

News January 16, 2025

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను నెల రోజుల్లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రుణాల మంజూరులో 100 శాతం లక్ష్యాలు చేరుకోవాలన్నారు.

News January 16, 2025

పారదర్శకంగా కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య  పరీక్షలు: ఎస్పీ

image

అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో గురువారం ఉదయం ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ జగదీశ్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News January 16, 2025

కశ్మీర్‌లో ప్రాణాలొదిలిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్

image

ధర్మవరానికి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణారెడ్డి (40) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కశ్మీర్ బార్డర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇవాళ మృతదేహాన్ని బసినేపల్లికి తీసుకురానున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

News January 16, 2025

అనంతపురంలో ‘డాకు మహారాజ్‌’ విజయోత్సవ వేడుక!

image

హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలిరోజే రూ.56కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ విజయోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఘటన కారణంగా అనంతలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News January 16, 2025

పెనుకొండ దారుణ ఘటన.. 22 మందిపై కేసు

image

ప్రేమికులు పారిపోవడానికి సహకరించిందన్న నెపంతో మహిళను వివస్త్రను <<15165737>>చేసి<<>> జుట్టు కత్తిరించిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

News January 16, 2025

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, జూదం ఆడుతున్న వారిపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

News January 15, 2025

కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?

image

కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.

error: Content is protected !!