India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ధర్మవరంలోని పీఆర్‌టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో శివరాఘవ రెడ్డి(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు తీసుకున్న రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. శివరాఘవ రెడ్డి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
YS జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లనున్నారు. ఈనెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లడానికి కోర్టును అనుమతి కోరారు. అయితే లండన్‌లో తనకు సెక్యురిటీగా అనంతపురం APSP బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ మహబూబ్‌ను నియమించేలా ఆదేశాలివ్వాలని సోమవారం అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపుతోంది. కాగా తమ వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులను YS జగన్ కోరారు.
అనంతపురం జిల్లాలోని కక్కపల్లి టమాటా మార్కెట్‌లో KG టమాటా ధర రూ.9గా ఉంది. సోమవారం కక్కపల్లి మార్కెట్‌కు 1050 టన్నుల టమాటా వచ్చినట్లు యార్డ్ కార్యదర్శి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే టమాటాకు ప్రసిద్ధి చెందిన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో సోమవారం KG టమాటా ధర రూ.14 పలికినట్లు మార్కెటింగ్ సూపర్‌వైజర్ తెలిపారు.
వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా ముదిగుబ్బ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు భాస్కర్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకముంచి జిల్లా సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. హెల్మెట్/ సీటుబెల్టు ధరించడంతో పాటు త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, తదితర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలన్నారు. మోటారు వాహనాల చట్ట ప్రకారంగా గడిచిన వారం రోజుల్లో 2,881 కేసులు నమోదు చేశామన్నారు.
తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. రోహిత్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.
ధర్మవరంలో గురువారం జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. 5,120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1,668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.
అనంతపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్‌లు చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.