India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నార్పల మండలం బండ్లపల్లిలో గ్రామంలో 2005లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం శిలాఫలకాన్ని ఆమె సందర్శించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి నేతలు దిగిన ఫోటోను ప్రజలకు చూపించారు. మొదటి జాబ్ కార్డ్ హోల్డర్‌కు జాబ్ కార్డ్ అందిస్తున్న ఫోటోను చూసి ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు.

నార్పల మం.బండ్లపల్లిలో ఉపాధి హామీ రథయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడారు. Ys రాజశేఖర్ రెడ్డి రైతును రాజును చేశారన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఆరోగ్యశ్రీ పథకం, 46 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇచ్చారన్నారు. YCP, TDP, జనసేనా పార్టీలు BJP పార్టీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడానికి ఆమె తప్పు పట్టారు.

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం జరిగిన PGRS కార్యక్రమంలో 108 పిటీషన్లు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ల్యాండ్ ఇష్యూస్, ఇంటి రాస్తా & భూ తగాదా విషయాలకు సంబంధించిన గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు ఇతరత్ర సమస్యలు మా దృష్టికి వచ్చాయన్నారు. ప్రతి పిటీషనర్‌తో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులను పలకరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన లబ్ధిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలని షర్మిల రెడ్డిని లబ్ధిదారులు కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా మా జీవితాలు బాగుపడ్డాయని లబ్ధిదారులు ఆమెకు చెప్పారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి నార్పల మండలం బండ్లపల్లిలో పర్యటించారు. ముందుగా గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా వైయస్ షర్మిలా రెడ్డిని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె గ్రామంలోకి రావడంతో పూలు వెదజల్లి ఘన స్వాగతం పలికారు.

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ పాల్గొన్నారు. బాధితుల నుంచి మొత్తం 525 అర్జీలను ఆయన స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అర్జీలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గడువు మించిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకూడదని, అర్జీదారులతో అధికారులు మర్యాదగా వ్యవహరించాలన్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ జగదీశ్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రజలు సహకరించాలని కోరారు.

బుక్కరాయసముద్రంలో నిర్వహించిన రెసిడెన్షియల్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో డీఈవో ప్రసాద్ బాబు పాల్గొన్నారు. 5 రోజుల ట్రైనింగ్‌లో నేర్చుకున్న విషయాలను మీస్కూళ్లలో అమలు చేయాలని KGBV ప్రిన్సిపల్స్ & హాస్టల్ వార్డెన్లకు సూచించారు. రాబోవు 2 నెలలు కీలకమని, పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు పరీక్షలు రాయడానికి సన్నద్ధం చేయాలన్నారు. రిజల్ట్స్ విషయంలో అనంతపురం జిల్లా టాప్ 10లో ఉండేలా చూడాలన్నారు.

Sorry, no posts matched your criteria.