India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంతకల్లు మండలం కసాపురం రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నప్పటికీ ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల గ్రామానికి చెందిన శివకుమార్ పనిమీద గుంతకల్లుకు వచ్చాడు. తిరిగి నంచర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కిందపడి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్ యార్డ్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠంగా కిలో రూ.19, కనిష్ఠ ధర రూ.10, సరాసరి ధర రూ.14తో అమ్ముడుపోతున్నట్లు రాప్తాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 1,650 టన్నుల టమాటా వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలకు తాడిపత్రికి చెందిన 7వ తరగతి విద్యార్థిని అస్రున్ ఎంపికైనట్లు కోచ్ మధు తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి SGFI స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో అండర్ -14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. ఎంపికైన విద్యార్థిని అస్రున్ను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.

APPSC బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ సి.శశిధర్ నియమితులయ్యారు. ఈయన అనంతపురం JNTUలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2000-06 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 2006-12 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2012 నుంచి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో సీఎం చంద్రబాబు చేతుల మీదగా బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్బంగా JNTUలోని విద్యార్థులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

బెలుగుప్ప మండలం గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం రామాంజనేయులు గురువారం చెప్పారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి పోటీలు జరిగాయి. గంగవరం పాఠశాలకు చెందిన తేజశ్రీ, శివానంద్, నవ్య, హర్షియా రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వారిని అభినందించారు.

అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ జగదీశ్ గురువారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి, ఆ స్థలంలో నూతన భవనాలు నిర్మిస్తే పోలీస్ శాఖకు ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిబ్బంది క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.

పిడుగు పడి రైతు గోవిందు (65), అతనితో పాటు ఉన్న ఎద్దు మృతి చెందిన ఘటన కణేకల్లు మండలం గరుడచేడులో బుధవారం చోటు చేసుకుంది. మరో ఇద్దరు షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తాడిపత్రికి చెందిన వినయ్ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ మ్యాచ్ స్కోరర్‌గా ఎంపికయ్యాడు. వినయ్ RDT తరుఫున అండర్-16, 19 విభాగంలో జిల్లా జట్టుకు ఆడటమే కాకుండా.. అంపైర్, స్కోరర్‌గా రాణిస్తున్న సమయంలో ప్రతిభ గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో స్కోరర్‌గా ప్రస్తుతం సేవలందిస్తున్నాడు. ICC women Cricket World Cup-2025 మ్యాచ్‌లు వైజాగ్‌లో జరగనున్నాయి. ఇంగ్లాండ్ V/S న్యూజిలాండ్ జట్టు స్కోరర్‌గా చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.