India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే కురుబ శివా అనే యువకుడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
రాజస్తాన్‌లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చేనేత క్లస్టర్ల ఏర్పాటు, ఏవియేషన, పెట్రోల్ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని కోరారు.
పరిటాల రవి హత్య కేసులో ముద్దాయి రేఖమయ్య విడుదలైనట్లు విశాఖ సెంట్రల్ జైల్ అధికారి కె.కుమార్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో 2013 నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రేఖమయ్యకు హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. పదేళ్ల అనంతరం బాహ్య ప్రపంచంలోకి రేఖమయ్య అడుగుపెట్టాడు.
తాడిపత్రి మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు దక్కింది. విజయవాడలో జరిగిన సమావేశంలో వీధి దీపాలు, వాటర్ సప్లై ఉపయోగంలో విద్యుత్ ఆదా చేసినందుకు గోల్డ్ మెడల్‌ను ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులు మీదుగా మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ అందుకున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధికారులను అభినందించారు.
మైనర్లకు బైక్‌లు ఇస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని ఫ్లవర్ క్లాక్ వద్ద 110 టూ వీలర్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. బైక్‌లకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగించుకుని రహదారులపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతపురం జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, రైళ్లను తరచూ తనిఖీలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
సీఎం కార్యాలయం నుంచి వచ్చే ప్రజా వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా భూ సమస్యల్లో రికార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన ఆదేశించారు. తహశీల్దార్లు 22A భూముల జాబితా శనివారం సమర్పించాలన్నారు.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై వైసీపీ సంచలన ఆరోపణ చేసింది. ఎమ్మెల్యే తల్లి నీలావతి రూ.5లక్షలకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించింది. ‘ఎమ్మెల్యే శ్రావణి టీడీపీ కార్యకర్తకే వెన్నుపోటు పొడిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునే రూ.5 లక్షలకి అమ్ముకున్నారంటే.. కూటమి నేతల దందాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. సంపద సృష్టిస్తానన్నావ్.. ఇలాగేనా చంద్రబాబూ’ అని ట్వీట్ చేసింది.
అనంతపురం(D) వజ్రకరూర్ మం. చాబాల గ్రామంలో ఘరానా మోసం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూర్ పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి డ్రైవింగే చేయడమే ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాలు నడపకుండా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే జరిమానాలను 3నెలల్లోపు చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేస్తామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.