Anantapur

News February 15, 2025

వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ ముందుకు: మంత్రి

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అనంతపురంలో మేధావులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్​ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయింపులు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనను సమన్వయం చేసుకుంటూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

News February 15, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

image

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 15, 2025

యాడికి మండల లారీ డ్రైవర్ దుర్మరణం

image

యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన లారీ డ్రైవర్ రాజు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మట్టి లోడ్ చేస్తున్న సమయంలో రాజు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. లారీపై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు గమనించి పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 15, 2025

ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలి: రామకృష్ణ

image

ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు పోరాడాలని సూచించారు. ఎంతో మంది పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సూచించారు.

News February 14, 2025

అనంత: ‘బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేశాడు.. డయల్ 100కు యువతి ఫోన్’

image

డయల్ 100కు ఫోన్ చేసి ఓ యువతి సాయం కోరడం చర్చనీయాంశమైంది. ‘సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నంబర్ బ్లాక్ చేసి మాట్లాడట్లేదు. వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించండి’ అని గుత్తి ఆర్ఎస్‌కు చెందిన యువతి కోరింది. కంట్రోల్ రూమ్ వారు స్థానిక పోలీసులకు తెలపడంతో కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను సంప్రదించారు. అయితే తన ఇంటికి రావొద్దని, వాడితో మాట్లాడి అన్‌బ్లాక్ చేయించాలని కోరడంతో బాయ్ ఫ్రెండ్‌‌తో మాట్లాడేందుకు యత్నించారు.

News February 14, 2025

అనంత: ప్రణతికి డాక్టరేట్

image

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.

News February 14, 2025

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

News February 14, 2025

FDPలు బోధన సిబ్బందికి ఎంతో ఉపయోగపడతాయి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని గురువారం వాధ్వానీ ఫౌండేషన్‌ వారు సందర్శించారు. అనంతరం జేఎన్టీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను(FDP) నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బోధన సిబ్బందికి FDPలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య పాల్గొన్నారు.

News February 13, 2025

క్రమబద్ధీకరణ పథకం కింద తొలి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 13, 2025

తాడిపత్రిలో శివలింగం కింద నీటిని ఎప్పుడైనా చూశారా!

image

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.