Anantapur

News February 8, 2025

మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

image

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.

News February 8, 2025

శైలజానాథ్‌కు కీలక పదవి ఇస్తారా?

image

పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్‌కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

News February 8, 2025

కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

image

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 

News February 8, 2025

అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

అనంతపురం జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News February 8, 2025

సత్తా చాటిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు

image

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పోలీసు స్పోర్ట్ మీట్‌లో తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు సత్తా చాటారు. దాదాపు 9 విభాగాలలో ప్రతిభ చూపినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. ట్రోపీలను, బహుమతులను అనంతపురం రేంజ్ డీఐజీ షిమోన్షి, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు తదితరులు పాల్గొన్నారు.

News February 7, 2025

హీరో నాగార్జునను కలిసిన అనంతపురం ఎంపీ

image

ఢిల్లీలోని పార్లమెంటులో సినీ నటుడు అక్కినేని నాగార్జునను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు. ప్రధాని మోదీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున ప్రధానిని కలిశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

News February 7, 2025

సోమందేపల్లి మండలంలో విషాదం.. వివాహిత సూసైడ్

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

News February 7, 2025

మాతృ భాషను బోధించాలి: అనంత కలెక్టర్

image

కేంద్రీయ విద్యాలయంలో మాతృ భాష తెలుగును కూడా బోధించాలని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం గుత్తిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్గదర్శకాల ప్రకారం తరగతి సీట్లను పెంచి అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు.

News February 6, 2025

మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

బుక్కరాయసముద్రంలో కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ నాయకుడు శ్రీరామ్ రెడ్డి, ఈవో రమేశ్ ఆధ్వర్యంలో స్వామిని పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగించారు. దేవరకొండపైకి తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.