India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టు కోసం 5,862 ఎకరాల భూమిని గుర్తించగా, ఇందులో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతపురంలోని పాతూరులో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి చూపిన ధర్మమార్గం, సమానత్వం, న్యాయం పట్ల ఉన్న భావాలను మనమందరం ఆచరణలో పెట్టుకోవాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కొఠారి కుష్బూ, తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ విధించిన ఘటన యాడికిలో చోటు చేసుకుంది. సీఐ వీరన్న వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ బాలికపై బత్తుల కృష్ణారెడ్డి గత శనివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు వేములపాడు సమీపంలో ఉండగా సోమవారం అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

అనంతపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 375 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజా క్షేమం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

సూపర్ GST.. సూపర్ సేవింగ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సూపర్ GST సూపర్ సేవింగ్‌పై JC శివ నారాయణ శర్మ, DRO మలోల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈనెల 19 వరకు సూపర్ GSTపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అనంతపురం ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో PGRS నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 88 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కరానికి వాటిని సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు.

శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలతో SP జగదీశ్ సమావేశం నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సభలో విధుల్లో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పారదర్శకత, నిజాయితీ, నిష్పక్షపాతంతో ప్రజలకు సేవ చేయాలని అన్నారు.

అనంతపురంలో శనివారం నిర్వహించిన SGF జిల్లాస్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన పెద్దవడుగూరు విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో పల్లవి, భువన చంద్రిక, చిన్న ఓబుల రెడ్డి, జ్ఞానేశ్వర్ (వెయిట్ లిఫ్టింగ్) ఉన్నారని ఉపాధ్యాయుడు మారుతి తెలిపారు. రాష్ట్రస్థాయికి తమ పిల్లలు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.